![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -266 లో.... శ్రీవల్లి లో చేతిలో భాగ్యం పదిలక్షలు పెడుతుంది. అవి కిందపడేస్తుంది. వల్లి.. నేను చెప్పేది విను ఈ పది లక్షలు తీసుకొని అల్లుడు గారికి ఇవ్వు.. దీనివల్ల నీకేం ప్రాబ్లమ్ రాదు.. పైగా ఆ విశ్వ మీ ఆడపడుచుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు.. రెండు కుటుంబాలు ఒకటి అవుతాయని భాగ్యం చెప్పగానే శ్రీవల్లి సరే అంటుంది.
మరొకవైపు ఎన్నిసార్లు నువ్వు ఎందుకు భయపడుతున్నావన్నా కూడా చెప్పలేదు.. నువ్వు ఎందుకు అలా ఉన్నవోనని నాకు భయం వేసిందని ప్రేమతో ధీరజ్ అంటాడు. నువ్వు నాకేం అవుతావురా.. మా అన్నయ్యతో నువ్వేం అన్నావో మర్చిపోయావా.. నేను ఒంటరిని నాకు ఎవరు లేరని ప్రేమ బాధపడుతుంటే.. నేనున్నానని ధీరజ్.. ప్రేమ చెయ్ పట్టుకుంటాడు. కానీ నీ మనసులో నేను లేనని ప్రేమ అనగానే చెయ్ వదిలేస్తాడు.. దాంతో ప్రేమ బాధపడుతుంది. మరొకవైపు భాగ్యం, ఆనందరావు, శ్రీవల్లి ముగ్గురు కలిసి వచ్చి.. చందుకి డబ్బు ఇస్తారు. దాంతో చందు హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఆ తర్వాత శ్రీవల్లి, భాగ్యం ఆనందరావు ముగ్గురు గుమ్మం దగ్గరికి వస్తారు. ఎదరుగా భద్రవతి, విశ్వ ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తానని శ్రీవల్లి వాళ్లకు చెయ్ ఊపుతుంది. అక్కడ నుండి భాగ్యం వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత నర్మదకి సాగర్ మల్లెపూలు తీసుకొని వస్తాడు. తరువాయి భాగంలో ప్రేమకి ధీరజ్ సారీ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |